Sun. Feb 23rd, 2020

T24Telangana

Telugu News, Latest News in Telugu, Breaking News, Live Updates, Sports News.

నవీపేట్ మండలములో పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి జయసుధ

గ్రామాల్లో పరిశుధ్యం పై దృష్టి సారించాలని నిజామాబాదు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ అన్నారు. నవీపేట మండలములో ని రాంపూర్, ఎల్ కె ఫారం గ్రామాల్లో పర్యటించిన ఆమె ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు పలు కాలనీలను సందర్శించారు. గ్రామాల్లో ఎక్కడ చెత్త వేయకుండా చూడాలని రోడ్ల పైన వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అధికారిని వెంట సర్పంచ్ రుతు కల్పన, ఎంపిటిసి గైని లావణ్య మోహన్ ,పంచాయతీ కార్యదర్శి ఉన్నారు. అటు జాన్నేపల్లి లో జెడ్పి సి ఈ ఓ గోవింద్ నాయక్ సందర్శించారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను ,వైకుంఠ ధామ నిర్మాణ పనులు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి పరిశుధ్యం పైన ఎప్పటికప్పుడు పంచాయితీ అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *